prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 10:03 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూరు అయ్యప్ప ఆలయానికి రూ.2 లక్షలు విరాళం.. దాతృత్వాన్ని చాటుకున్న బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి దంపతులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి పుల్లెంల వాస్తవ్యులు బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి – రాజరాజేశ్వరి దంపతులు రూ.2 లక్షల భారీ విరాళం అందజేశారు. శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 2,00,000/- లను చందాగా అందజేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దాతలను ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.