prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 11:18 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూరులో నేత్రపర్వంగా ఉట్లోత్సవం: భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణ శనివారం భక్తిపారవశ్యంతో మురిసిపోయింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఉట్లోత్సవాన్ని (ఉట్ల పండుగ) అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీకృష్ణునికి, శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకారాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భజనల నడుమ ఉట్లోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. యవకులు పోటీపడి ఉట్టిని కొట్టేందుకు చేసిన ప్రయత్నాలు, వారిపై నీళ్లు చల్లుతూ భక్తులు చేసిన సందడి చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. జై శ్రీకృష్ణ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ వేడుకల్లో ఉభయ దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, రావిరాల నగేష్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు పులిపాటి ప్రసన్న, అధ్యక్షులు గుర్రం బిక్షమయ్య, చెరిపెల్లి అంజయ్య, గంజి యాదగిరి, చేనేత సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పున్న ధర్మేందర్, గంజి అశోక్, జూలూరి వెంకటేశం, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు రాపోలు వెంకటేశం, తిరందాసు శ్రీనివాసులు, మార్కండేయ యువజన సంఘం సభ్యులు గంజి గంగాధర్, చిలుకూరి మణికుమార్, తిరందాసు భాస్కర్,బొల్ల శ్రీకాంత్, గంజి బిక్షం, ఉప్పల వెంకటేష్, యాదవ కుల పెద్దలు పన్నాల లింగయ్య యాదవ్, జక్కలి నాగరాజు, దోటి శ్రీను,దోటి యాదయ్య, దేవాలయ భజనపరులు పులిపాటి గోపయ్య తిరందాసు గోపయ్య, ఏలె మారయ్య, అచ్చాలు, ఏలె చంద్రశేఖర్, ఆలయ పూజారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు.