prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 6:35 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘనపురంలో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జన పూజలు…..రూ.99 వేలతో గణేశ్ లడ్డూను దక్కించుకున్న వేముల కేశవనాదం గౌడ్

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో వేముల కేశవనాదం గౌడ్ రూ.99 వేల ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతాజీ యువజన సంఘం సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.