ఘనంగా సెలెస్టియల్ హై స్కూల్ గణేష్ నిమజ్జనం
ఘనంగా సెలెస్టియల్ హై స్కూల్ గణేష్ నిమజ్జనం •••పాఠశాల కారస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో. •••తిలక్ స్ఫూర్తి తో గణేష్ ఉత్సవాలు. సిరిసిల్ల,ప్రజావాణి సిరిసిల్ల పట్టణంలోని అశోక్‌నగర్‌లో గల సెలెస్టియల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం గణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల పిండి వంటకాలతో వినాయకుడికి నైవేద్యం...