•మంజుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వార్షిక మహోత్సవం
అమీన్పూర్, సెప్టెంబర్ 6 (ప్రజావాణి):బీరంగూడలోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి త్రిశక్తి దేవత దేవస్థానం ద్వితీయ వార్షిక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమీన్‌పూర్ మాజీ ఇన్‌చార్జి సర్పంచ్ మంజుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి చండీ హోమాన్ని నిర్వహించారు.
ఆలయ కమిటీ చైర్మన్ సిగారి చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తులంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు సి. రవి, గ్రామస్తులు, వడ్డెర సంఘం పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
