నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
గట్టుప్పల్ కలురామ్ ఘుర్కా విద్యాదాయని విద్యాలయం పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా తదితర వేషధారణలతో ఆకట్టుకున్నారు. చిన్నారులు ఉట్లు కొట్టడంతో పాటు చక్కటి నృత్యాలు ప్రదర్శించి అందరినీ అలరించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం విశిష్టత, శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన విలువలను విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్ వివరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో, వివిధ వేషధారణలతో పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్ పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.