prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:32 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా వోడితల రాజేశ్వర రావు జయంతి వేడుకలు

ఘనంగా వోడితల రాజేశ్వర రావు జయంతి వేడుకలు

హుజురాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి రాజేశ్వరరావు

ప్రజావాణి సెప్టెంబర్ 16 ఈ వేడుకలలో పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వో డితల ప్రణవ్
హుజురాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజేశ్వరరావు అని వారు చేసిన పనులే ఇప్పటికీ సాక్షాలుగా నిలుస్తున్నాయని వారు చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు మరింత సేవ అందజేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వో డితల ప్రణవ్ అన్నారు బుధవారం రోజున మాజీ రాజ్యసభ సభ్యుడు వోడిత ల రాజేశ్వరరావు జయంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకల్లో పలువురు ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హుజరాబాద్ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా పలు అభివృద్ధి పనులు చేశారని ఆయన దురదృష్టం వల్ల ఈ సేవలు ఇప్పటి తరానికి కూడా ఉపయోగపడుతున్నాయని అన్నారు అనంతరం హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ సువాసినీ కౌన్సిలర్ అధికార ప్రతినిధులు అన్ని మండలాల పట్టణ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు ప్రజాప్రతినిధులు బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సేవాలాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కనక రత్నం మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు