prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:22 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి
కులకచర్లలో ఘనంగా నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

పరిగి సెప్టెంబర్ 26 (ప్రజావాణి)

తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను కులకచర్ల మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు టి. రాములు, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. త్వరలోనే ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ పౌరుషానికి నిలువెత్తు రూపం వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నాటి దొరల గడీల అహంకారానికి, భూస్వామ్య ఆధిపత్య పోకడలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన నిప్పుకణిక ఆమె అని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం చాకలి ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం యావత్ తెలంగాణకే కాక దేశానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె పోరాట పటిమను, ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీఏసీఎస్ చైర్మన్ బోల్సని భీమ్‌రెడ్డి, సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య, రజక సంఘం గౌరవ అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు, ఉప సర్పంచ్ మలే విజయ్ కుమార్, న్యాయవాది బాల ముకుందం, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, దళిత సంఘాల కన్వీనర్ తుప్పాలి అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, జిల్లా నాయకులు ప్రేమ్ ప్రకాష్ రెడ్డి, మలే కృష్ణయ్య గౌడ్, చెలిమిల్ల చంద్రలింగం, గదే మహిపాల్, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
మరియు డైరెక్టర్లు భరత్ రెడ్డి, టి. రామచంద్రయ్య, ఎల్లయ్య, బోయిని కృష్ణయ్య, రాములు, తుప్పలి వెంకటేష్, నాగాని వెంకట్ రాములు, బిచ్చయ్య, జెట్టిగల వెంకటయ్య, శివాని ఎల్లయ్య, సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మ శ్రీనివాస్, బాలుతో పాటు రజక సంఘం నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, హన్మంతు, గోపాల్, భీమయ్య, చిన్న బాలయ్య, బాలు, తిరుపతి, వెంకటేష్, కేశవులు, పలువురు ప్రజాప్రతినిధులు, సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.