ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

*ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ* *అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ – మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి ): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం గంట్లకుంట గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వీరనారి, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన చాకలి ఐలమ్మ మన పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్...