prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 4:23 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

*ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు*

*విశ్వకర్మ భగవానుడి నైపుణ్యం, సృజనాత్మకత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం*

*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17(మన సమగ్ర ప్రజా వాణి):శిల్పకళ, నిర్మాణ రంగం, చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలకు విశ్వకర్మ భగవానుడి సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విశ్వకర్మ భగవానుడు నిర్మాణం, శిల్పకళకు ప్రతీక అని, తన అపారమైన సృజనాత్మకత, అసమాన ప్రతిభతో సమాజ ప్రగతికి విశేషంగా దోహదపడిన ఆయన ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ పాల్గొని, భగవాన్ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, జిల్లా విశ్వబ్రాహ్మణ కుల సంఘం అద్యక్షులు రామేశ్వర చారి, ఉపాధ్యక్షులు ఉప్పలయ్య చారి, విశ్వబ్రాహ్మణ కుల మహిళా సంఘం ఉపాధ్యక్షులు గంగాభవాని, జనగామ పట్టణ వడ్రంగి సంఘం అధ్యక్షులు సాంబయ్య చారి, విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు దిగోజు నరసింహ చారి, సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురాములు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు నోముల బాలరాజు, ఇతర కుల సంఘాల ప్రతినిధులు, చేతివృత్తిదారులు, జిల్లా అధికారులు, ఐడిఓసి సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.