prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:15 pm Digital Edition : SURENDHARTEKUMATLA TEKUMATLA

ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

టేకుమట్ల/ప్రజావాణి :టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామం లో విగ్నేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భక్తి శ్రద్ధలతో మహ అన్నదానకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యంసమర్పించారు.అనంతరం భక్తులు గ్రామస్తులకు మహా అన్నదానం చేపట్టారు.ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని అన్నప్రాసదాన్ని స్వీకరించారు.వినాయకుని ఆశీస్సులతో గ్రామ ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ దిలీప్ రెడ్డి,ఉప సర్పంచ్ నల్లబెల్లి, మొండి ,బీంపెల్లి సది,దాసారాపు రవి, ధర్మ సమాజ్ పార్టీ నాయకలు దాసారాపు భాస్కర్ శ్రీకాంత్,నాగరాజు, సురేందర్, వర్ధన్, సురేష్,భక్తులు గ్రామస్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.