ఘనంగా భద్రరెడ్డి జన్మదిన వేడుకలు
ప్రైమరీ స్కూల్ లో బుక్కులు, పెన్నులు పంపిణీ చేసిన తుడుం గణేష్
ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన నాయకుడు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చామకూర భద్రారెడ్డి అని మేడ్చల్ మున్సిపల్ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ కొనియాడారు. భద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా తుడుం గణేష్ ఆధ్వర్యంలో భద్రారెడ్డి ని కలిసి కేక్ కట్ చేయించి, శాలువాతో, గజమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పూడూరు – కిస్టాపూర్ డివిజన్ కిస్టాపూర్ లోని ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్కలను, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుడుం గణేష్ మాట్లాడుతూ తండ్రి మల్లారెడ్డి కి తనయుడిగా సేవాభావంతో ముందుకు పోతున్న నాయకుడు భద్రారెడ్డి అని కొనియాడారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడిగా పార్టీ అభివృద్ధి కి కృషి చేశారన్నారు. ఈరోజు పూడూర్ కిష్టాపూర్ కార్పొరేషన్ పరిధిలో కిష్టాపూర్ లో ప్రైమరీ స్కూల్లో ఈరోజు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో పిల్లలకు బుక్స్ పంపిణీ పెన్నులు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుమార్, సాయి గౌడ్, కాశి, శ్యామ్, నరసింహ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.