prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:30 am Digital Edition : PRAJA VANI

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

*ఘనంగా ప్రజా పాలన దినోత్సవం*

*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ*

*అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న గ్రామ ప్రజలు*

ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17:

బయ్యారం మండలం జగ్గుతండా గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదురించి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుంజ వీరస్వామి, వార్డు సభ్యులు వట్టం సావిత్రి, కండ్రాతి యాకేష్, ఈసం పావని, మక్కల దుర్గారావు, అంగిరేకుల లలిత, తేజవత్ రాఘవేంద్ర, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.