ప్రజా పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
బెజ్జంకి తహసీల్దార్ కళ్యాణపు శ్రీకాంత్
బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల తహసీల్దార్ కళ్యాణపు శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.