prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 1:25 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా దాసరి సతీష్ పుట్టినరోజు వేడుకలు

*ఘనంగా దాసరి సతీష్ పుట్టినరోజు వేడుకలు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం యశ్వంతపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొట్ల హరీష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ దాసరి సతీష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్ హాజరై కేక్ కటింగ్ చేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కందాల చంద్రశేఖర్, గడ్డం నరసయ్య, కాముని మహేష్, గువ్వల నరేష్, గడ్డం హరీష్, దాసరి జాన్, గడ్డం ప్రణయ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.