ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం
ప్రజావాణి సెప్టెంబర్ 26 కమలాపూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్….
ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం భూస్వాముల పై పెత్తనందారులపై పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళా సమాజంలో జరిగే అన్యాయాలపై దోపిడీపై గలమెత్తి ఒక్కొక్క మహిళా ఒక్కొక్క చాకలి ఐలమ్మా అయ్యి అన్యాయాలపై అవినీతిలపై పోరాటం చేయాలని పిలుపునివ్వనైంది 
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మధు సర్పంచులు కళాధర్ రాజు కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ మాట్లా రమేష్ బాల పూరి కనకరత్నం శోభన్ కొలిపాక శంకర్ సాంబయ్య సురేష్ రజక సంఘ నాయకులు మెరుపురి విజయ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు