పోరుమామిళ్ల, సెప్టెంబర్ 7: ప్రజావాణి మండల కేంద్రంలోని స్థానిక అమ్మవారిశాలలో టేకూరుపేట పంచాయతీకి చెందిన ప్రముఖులు గాదంశెట్టి సురేంద్ర కుమార్తె నిశ్చితార్థ వేడుక సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభకార్యానికి బద్వేల్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ, వైఎస్సార్సీపీ నాయకులు నారిశెట్టి నాగేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నారోజు రమణాచారి-భవాని దంపతులు కూడా విచ్చేసి వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిశ్చితార్థం చేసుకున్న వధూవరులను అతిథులు పూలమాలలతో సత్కరించి, అక్షింతలు వేసి దీవించారు. రాబోయే వారి నూతన దాంపత్య జీవితం నిండు నూరేళ్లూ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.