
మున్సిపల్ చైర్మన్ డా.కోడి శ్రీనివాసులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూర్ ఆయుర్వేదిక్ డే సందర్భంగా ఆయుష్ మెడికల్ క్యాంప్ను బుధవారం చండూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, యునాని వైద్య నిపుణులు డాక్టర్ టి. సౌజన్య, యోగా శిక్షకుడు ఈ వెంకటేష్, పాల్గొని ప్రజలకు ఆయుర్వేద, యునాని వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. ఆయుర్వేదం, యునాని వంటి సంప్రదాయ వైద్య విధానాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, చండూరు మండల, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.