prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:28 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

సెప్టెంబర్ 27.ప్రజావాణి న్యూస్ /సంగెం

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ111వ జయంతి వేడుకలు సంగెం మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి పండ్లు పంపిణీ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ పేర్ల లలిత రమేష్ మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి కందగట్ల నరహరి మాట్లాడుతూ1915 సెప్టెంబర్ 27న కొమరం భీం జిల్లా వాంకిడిలో జన్మించిన బాపూజీ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో,నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1952 నుండి 1971 వరకు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా పనిచేసి, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రి బాపూజీ అని కొనియాడారు.
బాపూజీ తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాల,ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఆయన నివాసం ‘జలదృశ్యం’ లోనే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, అక్కడి నుండే మలిదశ ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు.అనంతరం ఆయన చేసిన పోరాటాలను, తెలంగాణ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంగెం పద్మశాలి సంఘం అధ్యక్షులు బిట్ల సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి మెట్టుపల్లి మల్లయ్య,మెట్టుపల్లి రమేష్, కోడూరి సదయ్య,అప్పల కవిత,వార్డు సభ్యులు వుండ్డిల మల్లికార్జున్, గొల్ల సందీప్ ,మెట్టుపల్లి కృష్ణ,పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఇప్ప కాయల రమేష్ బాబు,ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల మనోహర్, కమిటీ
సభ్యులు బిట్ల రామకృష్ణ,కందకట్ల వెంకటేశ్వర్లు, కందకట్ల సంపత్ ,ఇప్ప కాయల విజయ్ ప్రకాష్,పేరాల లక్ష్మీ నరసయ్య , అందే కృష్ణమూర్తి,బిట్ల లక్ష్మణ్, బిట్ల రామ్మూర్తి,బిట్ల వేణు,నల్ల రాజు , నల్లశంకర్,చిందం వీరస్వామి, కొంతం వేణు, వీరేశం, సుధాకర్,పులిపాటి మధు, రాజా నరేందర్,కటకం బిక్షపతి, బూర ప్రకాష్, గుల్లపల్లి చంద్రశేఖర్,ఊరుగొండ రాజు,పులిపాటి రాజు,పద్మశాలి సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.