ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశం

ఘట్కేసర్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ఘట్కేసర్ లయన్స్ క్లబ్ సభ్యుల సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, అక్టోబర్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. అక్టోబర్‌లో నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు, వాటి విధివిధానాలు, సభ్యుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి సూచించారు. ఈ...