prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:10 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశం

ఘట్కేసర్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ఘట్కేసర్ లయన్స్ క్లబ్ సభ్యుల సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, అక్టోబర్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు.

అక్టోబర్‌లో నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు, వాటి విధివిధానాలు, సభ్యుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ బచ్చు నగేష్ గుప్త, స్టాండర్డ్ చార్టెడ్ సారా శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్ రవికుమార్, కార్యవర్గ సభ్యులు మారం లక్ష్మారెడ్డి, కమలాకర్, బచ్చు ప్రమోద్, రామ్మోహన్, రాజ్‌కుమార్, సారా మురళి, శ్రీధర్, రవి శంకర్, హిమబిందు, భోగ లక్ష్మి, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన క్లబ్ సభ్యులందరికీ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.