ఘట్కేసర్‌లో ‘యాప్ డేటింగ్ ప్యార్’ చిత్రం విడుదల….మల్లారెడ్డి చేతుల మీదుగా యూట్యూబ్‌లో ఆవిష్కరణ
ఘట్కేసర్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్‌లో ‘అప్‌డేటింగ్ ప్యార్’ చిత్రం విడుదలైంది. ఘట్కేసర్‌లోని పాత గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చిత్రాన్ని యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేశారు. నేటి యువతలో మారుతున్న ప్రేమ సంబంధాలు, సహజీవనం, వివాహానికి ముందే గర్భం దాల్చిన సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి, సామాజిక పరిస్థితులు, మానసిక సంఘర్షణలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవ జీవితంలో చోటుచేసుకునే సంఘటనల...