ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్ సమరభేరి…‘420’ హామీల అమలుపై నిలదీత.. 1,700 మంది రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్…..ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో….
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై బీఆర్‌ఎస్ నాయకులు ఘట్‌కేసర్‌లో ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ చేపట్టిన ఎనిమిది రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఘట్‌కేసర్ ఎంఎంసీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఘట్‌కేసర్ రైతు సహకార సంఘం బ్యాంకు పరిధిలోని సుమారు 1,700 మంది రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ...