ఘట్కేసర్‌లో ఎస్ ఆర్ ఓ కార్యాలయం దగ్గర ఘనంగా అన్నదాన కార్యక్రమం

ఘట్కేసర్, సెప్టెంబర్ 17 (ప్రజా లక్ష్యం): గణేష్ చతుర్థి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఘట్కేసర్ సర్కిల్ 6వ డివిజన్ పరిధిలోని ఎస్‌ఆర్‌ఓ ఘట్కేసర్ వద్ద డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.