prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 10:30 am Digital Edition : PRAJA VANI

గ్రామ యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

గ్రామ యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

–అధ్యక్షుడిగా వంకా రాజేశ్‌ నియామకం

భిక్కనూర్, సెప్టెంబర్ 17 ( ప్రజావాణి ):

భిక్కనూర్ మండలం బస్వాపూర్‌ గ్రామ యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వంకా రాజేశ్‌ను నియమించారు. భిక్కనూర్‌ మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీరామ్‌ వెంకటేష్‌ నూతన అధ్యక్షుడు వంకా రాజేశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

యువజన కాంగ్రెస్‌ గ్రామస్థాయిలో యువతను ప్రజాసేవ వైపు ప్రోత్సహిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని శ్రీరామ్‌ వెంకటేష్‌ సూచించారు.
అధ్యక్షుడుగా వంకా రాజేశ్‌, ఉపాధ్యక్షుడుగా సాకలి రమేశ్‌, ప్రధాన కార్యదర్శులుగా వంకా తరుణ్‌, ఎరుకల చంద్రం
కార్యదర్శులుగా డప్పు నితిన్‌, ఎర్రోళ్ల అక్షయ్‌,కోశాధికారిగా జుట్టరాజు, ముఖ్య సలహాదారులుగా కమ్మరి ఈశ్వరయ్య, నాగని నందు,సలహాదారులుగా వంకా వరుణ్‌, నాగని వేణు
సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా రామగల్ల అక్షయ్‌
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తుడుం పద్మ స్వామి, గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మన్నె మల్లేశం, మాజీ అధ్యక్షుడు చింతనూరి సిద్ధరాములు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు తుడుం జీవన్‌, భిక్కనూర్‌ మండల యువజన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామగల్ల బాబు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎల్లం, తుడుం భూషణం, ముత్తొన్నోల కిష్టయ్య, రామగల్ల స్వామి, జిట్టా రాజు, మిద్దె లోకేష్‌, తుడుం ప్రదీప్‌, డప్పు నితిన్‌, ఎరుకల చంద్రం, బాలకృష్ణ, సిద్దగిరి, పోచమైన రాజు, ఈశ్వర్‌, ప్రణయ్‌ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.