గ్రామపంచాయతీ సిబ్బంది వ్యక్తిగత పనులకా?
గ్రామపంచాయతీ సిబ్బంది వ్యక్తిగత పనులకా? పాలకవర్గ సభ్యుడి వినాయక మండపం వద్ద సిబ్బందితో పనులు చేయించడంపై గ్రామస్తుల ఆగ్రహం తంగళ్లపల్లి, సెప్టెంబర్ 21, ప్రజావాణి: తంగళ్లపల్లి మండలంలోని టెక్స్‌టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన పనులను గ్రామపంచాయతీ సిబ్బందితో చేయించడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రజా అవసరాలు, పారిశుద్ధ్య పనుల కోసం వినియోగించాల్సి ఉండగా వ్యక్తిగత కార్యక్రమాలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని...