గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ప్రతి అర్హుడూ భాగస్వామి కావాలి
*పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి* తొర్రూర్ సెప్టెంబర్ 27 పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ యువత, ఉద్యోగులు, విద్యావంతులందరూ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమంలో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, 2027 మార్చిలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ...