prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 10:01 pm Digital Edition : SHEKARREDDY PATANCHERUV

గౌతంనగర్‌లో కొలువుదీరిన గణనాథుడు

*గౌతంనగర్‌లో కొలువుదీరిన గణనాథుడు!

 

*ఫేజ్‌-2లో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు..

 

*భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాలనీవాసులు

 

పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 14 (ప్రజావాణి): పటాన్‌చెరు పట్టణ పరిధిలోని గౌతంనగర్‌ కాలనీ ఫేజ్‌-2లో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఉత్సవాల తొలిరోజు కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గౌతంనగర్‌ కాలనీ జనరల్‌ సెక్రటరీ దొరటి చంద్రశేఖర్‌, ట్రెజరర్‌ లింగయ్య, శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏకాంత్‌, ఆకాష్‌, రిషితో పాటు కాలనీవాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.