prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 3:26 pm Digital Edition : MAHESH MEDCHAL

గౌడవెల్లి అంబేద్కర్ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జనం

గౌడవెల్లి అంబేద్కర్ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జనం

ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ సీనియర్ నాయకులు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్

గుండ్లపోచంపల్లి, (ప్రజా వాణి): గుండ్లపోచంపల్లి డివిజన్ 299 పరిధిలోని గౌడవెల్లి అంబేద్కర్ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. వినాయక మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వినాయకుడికి పూజలు చేసి, భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుడి నిమజ్జనాన్ని పురస్కరించుకొని కాలనీలో భక్తులు సందడి చేశారు. గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఘనంగా వీడ్కోలు పలికారు.

వినాయక మండప నిర్వాహకులు, కాలనీ వాసులు కలిసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ మేడ్చల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు, నాగులూరి సుధాకర్, కొమ్మరాజు, నాగులూరి చింటు, కొమ్ము చింటు, మధు, సుదర్శన్, రాఘవేందర్, అంజి తదితరులు పాల్గొన్నారు.