గోపవరం మండలంలో ఓటర్ల జాబితా విడుదల: ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ఎంపీడీఓ శ్రీధర్ పిలుపు

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ సెప్టెంబర్ 11ప్రజావాణి  నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను శుక్రవారం అధికారికంగా ప్రచురించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి  శ్రీధర్,డిప్యూటీ ఎంపీడీఓ హసీనా ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పారదర్శకంగా రూపొందించిన ఓటర్ల జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రానున్న ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ...