prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:20 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గోపవరం మండలంలో ఓటర్ల జాబితా విడుదల: ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ఎంపీడీఓ శ్రీధర్ పిలుపు

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ సెప్టెంబర్ 11ప్రజావాణి  నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను శుక్రవారం అధికారికంగా ప్రచురించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి  శ్రీధర్,డిప్యూటీ ఎంపీడీఓ హసీనా ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పారదర్శకంగా రూపొందించిన ఓటర్ల జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రానున్న ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన అభ్యర్థించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.మండలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ ప్రధాన రాజకీయ పార్టీల స్థానిక నాయకులు,ముఖ్య కార్యకర్తలు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.