గోపవరం ఎంపీడీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం: ముసాయిదా పోలింగ్ కేంద్రాల వివరాల వెల్లడి
గోపవరం,సెప్టెంబర్ 16:ప్రజావాణి మండల పరిధిలోని ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఈరోజు గోపవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ అధ్యక్షత వహించారు.రాబోయే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా,శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.సమావేశంలో మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ముసాయిదా పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు...