prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 8:06 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గోపవరంలో టీడీపీకి జోష్.. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి 350 కుటుంబాలు*

గోపవరం సెప్టెంబర్ 6 ప్రజావాణి మండలంలో టీడీపీకి భారీ బలం. వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 350 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు గోపవరం మండలంలోని వివిధ గ్రామాలు,పంచాయతీలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు,వారి కుటుంబ సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ భూపేష్ సుబ్బరామిరెడ్డి బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి  సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. *మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నారపరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కలువాయి విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నారపరెడ్డి నరసింహారెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.*350 కుటుంబాల చేరికతో గోపవరం మండలంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైందని టీడీపీ నాయకులు* పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది టీడీపీ కుటుంబంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు, గోపవరం మండలంలోని వివిధ పంచాయతీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.