prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 5:06 pm Digital Edition : PRAJA VANI

గోదావరిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం

గోదావరిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం

ఎల్లంపల్లి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గణేష్‌ నిమజ్జనానికి నిర్దేశిత ప్రాంతాల్లోనే వెళ్లాలి:

ఈఈ రవీంద్ర చారీ

మంథని నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబరు 23, ప్రజావాణి:

గణేష్‌ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నందున గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేపట్టనున్నట్లు విభాగం నం.7, రామగుండం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి. రవీంద్ర చారీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాజెక్టు దిగువన గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, పల్లెకారులు, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నది ఒడ్డుకు లేదా నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని కోరారు.
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా అధికారులు సూచించిన నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని, భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. అధికారుల సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ ప్రజల భద్రతకు సహకరించాలని ఈఈ విజ్ఞప్తి చేశారు.