prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 5:32 pm Digital Edition : PRAJA VANI

గోకేనపల్లిలో హోరాహోరీగా లడ్డు పాట

*గోకేనపల్లిలో హోరాహోరీగా లడ్డు పాట*

*భక్తుల సందడి మధ్య ఉత్కంఠభరితంగా వేలం*

రూ.32,216 కు గుంజులూరి ప్రియాంక–నరేష్ దంపతుల సొంతం
ముదిగొండ సెప్టెంబర్ 27 ప్రజావాణి ప్రతినిధి

ముదిగొండ మండల పరిధిలోనీ గోకినేపల్లి గ్రామంలో నిర్వహించిన లడ్డు పాట హోరాహోరీగా సాగింది.ఎర్రకోటయ్య స్తూపం సెంటర్‌లోని విగ్రహం వద్ద నిర్వహించిన ఈ వేలం పాటలో గ్రామస్తులు, భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లడ్డును దక్కించుకునేందుకు పలువురు పోటీపడటంతో వేలం ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠను రేపింది.ప్రారంభం నుంచే పోటీదారులు ధరను పెంచుతూ వెళ్లడంతో లడ్డు పాట రసవత్తరంగా మారింది.ఒకరిని మించి మరొకరు ధర పలుకుతూ చివరి వరకు పోటీ కొనసాగించారు. చివరికి గుంజులూరి ప్రియాంక–నరేష్ దంపతులు రూ.32,216కు లడ్డును దక్కించుకున్నారు.దంపతులు అత్యధిక ధరకు లడ్డును సొంతం చేసుకోవడంతో కార్యక్రమ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.లడ్డు పాట సందర్భంగా స్తూపం సెంటర్‌లో సందడి నెలకొంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేలం పాటను ఆసక్తిగా తిలకించారు.లడ్డు పాటలో పోటీ చివరి దశ వరకు ఉత్కంఠగా సాగడం, రూ.32,216కు వేలం ముగియడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.గుంజులూరి ప్రియాంక-నరేష్ దంపతులు లడ్డును దక్కించుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.