prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 8:45 pm Digital Edition : PRAJA VANI

గూడూరులో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్

గూడూరులో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్

ప్రజావాణి సెప్టెంబర్ 30 కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని గూడూరు లోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు

కమలాపూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి కుమార్ మరియు ఎన్ఎస్ఎస్ అధికారి ఏ జ్యోతి మార్గదర్శకత్వం లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆలయ పరిసరాలు శుభ్రపరచి చెత్తను తొలగించారు పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించారు

ఈ కార్యక్రమానికి మేటివేషనల్ స్పీకర్ మరియు అడ్వకేట్ జైపాల్ రెడ్డి హాజరై విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు సామాజిక బాధ్యతను పెంపొందించుకొని సహజసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు

అలాగే తెలుగు ఉపాధ్యాయురాలు శోభా కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తగిన ప్రదేశంలో వేయడం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు తెలియజేశారు ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో క్రమశిక్షణతో అంకితభావంతో పాల్గొనాలని సూచించారు

పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన సహజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం అందించారు
నాట్ మీ బాట్ యు అనే ఎన్ ఎస్ ఎస్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాలంటరీలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు