గుల్లకోటలో వైభవంగా ‘స్వచ్ఛత హి సేవ’ ప్రారంభం
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, తడి-పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు. పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య భీమా పత్రాలు అందించారు. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ పక్షోత్సవాల్లో ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం-పరిశుభ్రత పెంచుతామన్నారు. పారిశుధ్య కార్మికులను సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కొమురయ్య, హెచ్‌ఎం మునిందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.