గుల్లకోటలో జగన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పురోహిత సంఘం
జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, ఆర్ఎంపి వైద్యుడు, డిడిఎన్ పురోహిత సంఘం సభ్యులు సింహాచలం జగన్ ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న డిడిఎన్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షుడు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తోటి పురోహితులంతా గుల్లకోటలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించిన...