గుర్రంపోడు లిటిల్ చాంపియన్ స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ లిటిల్ చాంపియన్ స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరిగాయి. స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులచే ఉట్టి కొట్టే కార్యక్రమం, భగవద్గీత శ్లోక పఠనం, సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ - "పిల్లలలో చిన్ననాటి నుండే మన...