గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తొర్రూరు ఎస్సై మహేం
దర్ రెడ్డి
తొర్రూర్
మండలం మటేడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఘటనలో మృతి చెందిన వ్యక్తి మటేడు గ్రామానికి చెందిన గౌడ్ కులానికి చెందిన చీకటి శ్రీనుగా గుర్తించడం జరిగిందని,
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడం జరిగిందని ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించడం జరిగిందని, అతని భార్య యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.