గురువులకు ఘన సన్మానం….అన్నోజిగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం….జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పి. భాషయ్య ఎంపిక….. ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి టీం సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి.

ఘట్కేసర్, సెప్టెంబర్‌ 7 (ప్రజావాణి): గురువుల సేవలను స్మరించుకుంటూ అన్నోజిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ‘రేవంత్‌ అన్న టీం’ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రధానోపాధ్యాయులు తిరుమలరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తూ, పాఠశాల...