గురుదక్షిణ గొప్ప ఆలోచన రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో భిన్నంగా గురుపూజోత్సవం అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుదక్షిణ పేరుతో పుస్తక ఆవిష్కరణ
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గురుపూజోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. గురుదక్షిణ కవితా సంకలనం పేరుతో పుస్తకాన్ని ముద్రించి యూనివర్సిటీకి చెందిన జర్నలిజం విద్యార్థులు గురువులకు అంకితం చేశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిజిస్ట్రార్ హనుమంతరావు మాట్లాడుతూ కేవలం వారం రోజుల్లోనే.. చక్కటి కవితలతో అందమైన డిజైన్ తో అంత మంచి పుస్తకం తీసుకొచ్చారంటే.. వీరు భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు తీసుకొస్తారని, తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సంపాదకులు కొండూరి కోటి బాబు, ఎస్. కళ్యాణ్ దాస్, నాగుల అంజిబాబులను అభినందించారు. ఈ పుస్తకానికి...