గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించండి
*గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించండి* *రాయికల్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):* రాయికల్ పట్టణంలోని చారిత్రక, ఆధ్యాత్మిక సంపద అయిన గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి ఆదివారం గుడికోటలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ కు వినతిపత్రం అందజేశారు.ఒకే ప్రాంగణంలో పంచముఖ లింగేశ్వర స్వామి, శ్రీ కేశవనాథ స్వామి, సూర్యనారాయణ స్వామి కొలువైన ఈ ఆలయం అరుదైన శిల్పకళకు, చారిత్రక...