గుగ్గిళ్ల లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

32 ఏళ్లతర్వాత కలుసుకున్న మిత్రులు.. గురువులకు ఘన సన్మానం బెజ్జంకి, సెప్టెంబర్ 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1993–94 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఒకే వేదికపైకి చేరిన చిన్ననాటి మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తమ జీవితాలకు విద్యాబాటలు చూపిన గురువుల సేవలను...