గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బెజ్జంకి, సెప్టెంబర్ 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1993–94 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా తమకు ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకేచోట చేరి, పాఠశాలలో తాము చదువుకున్న నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ జీవితాలకు విద్యాబాటలు చూపిన ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య...