prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 10:42 am Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్లలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం –

 

బెజ్జంకి, సెప్టెంబర్ 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని అన్ని వార్డుల్లో చెత్తను తొలగిస్తున్నారు.గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యపై వార్డు ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామ ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.