గుగ్గిళ్లలో ఎస్ఐఆర్ నోటీసులపై విచారణ
బెజ్జంకి, సెప్టెంబర్ 11 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 254, 255కు సంబంధించి ఎస్ఐఆర్ నోటీసులపై శుక్రవారం విచారణ నిర్వహించారు. బెజ్జంకి తహసీల్దార్ శ్రీకాంత్ హాజరై నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వివరాలు,అభ్యంతరాలను స్వీకరించి,ఓటర్ల అర్హతకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి, వారి సమస్యలు, అభ్యంతరాలను నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉప సర్పంచ్ ధుగ్యాని లావణ్య మోహన్, పంచాయతీ కార్యదర్శి వంశీ, జీపీఓ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.