గుండ్ల పోచంపల్లిలో ఘనంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
గుండ్ల పోచంపల్లి: డివిజన్ పరిధిలో పేద ప్రజలకు కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వీఆర్వో ప్రభు, రేషన్ డీలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గౌడవల్లి మాజీ సర్పంచ్, గుండ్ల పోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్, మాజీ సర్పంచులు బండారి నరేందర్ ముదిరాజ్, బేరి ఈశ్వర్, మేడ్చల్ జిల్లా ఓబీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ అధ్యక్షులు గడిలా కృష్ణారెడ్డి, గుండ్ల పోచంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొజ్జ ఆదిలక్ష్మి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మరిలమ్మ, గుండ్ల పోచంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరంగవరం నవీన్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు పులిగళ్ల రాజేశ్వర్, సుతారిగూడ మాజీ ఉప సర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్, డివిజన్ సేవాదళ్ అధ్యక్షులు చిల్ల సాయి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ నాయకులు ఎల్. రవీందర్ గౌడ్, వీరస్వామి, సంపత్ యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, మద్దుల మాధవరెడ్డి, సుంకరి శ్రీనివాస్ ముదిరాజ్, రాజశేఖర్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా గరిసెల సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు కొత్త స్మార్ట్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని సురేందర్ ముదిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.