prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:33 am Digital Edition : MAHESH MEDCHAL

*గుండ్లపోచంపల్లి డివిజన్‌లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పిటిసి సాయిపేట శ్రీనివాస్*

*గుండ్లపోచంపల్లి డివిజన్‌లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పిటిసి సాయిపేట శ్రీనివాస్*

మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మైసమ్మగూడ, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ వినాయక విగ్రహ మండపాలను మేడ్చల్ మాజీ జడ్పీటీసీ, గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, గుండ్లపోచంపల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా మండపాల వద్ద భక్తులు, నిర్వాహకులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మండపాల వద్ద జరుగుతున్న ఉత్సవాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని సాయిపేట శ్రీనివాస్ ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.మైసమ్మగూడ, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లోని వివిధ వినాయక మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఉత్సవ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు అమరం మహిపాల్ రెడ్డి, కుంచ శ్రీనివాస్ గౌడ్, తలారి వెంకట్, జల్లి శివ, బొప్పిడి నర్సింహారెడ్డి, పల్లపు రాజు, పల్లపు చంద్రం, నాని, సంతోష్, జంగిటి ప్రకాష్, మహేందర్, మద్దుల మాధవరెడ్డి, సుంకరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.