గీతా విద్యాలయము లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చందూర్‌లోని గీతా విద్యాలయం పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలతో సందడి చేయడంతో పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేడుకల్లో విద్యార్థులకు శ్రీకృష్ణ, రాధ వేషధారణ పోటీలు, భజనలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో శ్రీకృష్ణుడి జీవిత విశేషాలను, ఆయన బోధించిన ధర్మాలను తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి....